BREAKING
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా కేటీ జకారియా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం: ఈ నెల 14 లేదా 15న నోటిఫికేషన్ విడుదల! బంగ్లాదేశ్‌లో వైభవంగా మహాలయ వేడుకలు దసరా సెలవులు.. విద్యార్థులకు అవస్థలు! జై శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో, ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు* పాకల బీచ్ విషాదంపై ఎమ్మెల్యే తాటిపర్తి దిగ్భ్రాంతి.. "సంతాపంతో సరిపెట్టొద్దు తాగునీరు కరువు.. రోడ్డెక్కిన కాలనీవాసులు *పూల పండుగకు శ్రీకారం.. పల్లెల్లో బతుకమ్మ సందడి!* *•ఆటపాటలతో అంబరాన్నంటిన సంబురాలు* కోటి రూపాయలతో రోడ్డు పనులకు శంకుస్థాపన సముద్రపు దీపస్తంభాల అద్భుత రూపాంతరం త్రివేణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు వారణాసిలో ఫిట్ ఇండియా సైకిల్ యాత్ర...ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రేపు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన దసరా సంబరాల టెండర్లలో గోల్‌ మాల్‌ - ఎసి విచారణ - టెండర్లు రద్దు? తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి కేటీఆర్ అండ ముగ్గురు ఆడబిడ్డల పేరిట ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్

రైతుల కరెంటు కష్టాలను తీర్చాలి

Select Suryaa Now
రైతుల కరెంటు కష్టాలను తీర్చాలి

రైతుల కరెంటు కష్టాలను తీర్చాలి

రాజీవ్ రహదారిపై కుకునూరుపల్లి బిజెపి మండల కిసాన్ మోర్చా ధర్నా

కుకునూరుపల్లి,మేజర్ న్యూస్..... రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు దండుకొని  అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యుత్ సంస్థలను పరిష్కరించాలంటూ శుక్రవారం కుకునూరుపల్లి మండల బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై ధర్నా చేసి సబ్ స్టేషన్ లో వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలకు సరైన సమయంలో నీరు అందక రైతులు నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ప్రకటనలు చేయడం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో విద్యుత్ సరఫరా సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు, తక్కువ వోల్టేజ్ సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడంతో పాటు, విద్యుత్ శాఖ అధికారులు రైతుల సమస్యలపై తక్షణమే స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది.ఈకార్యక్రమంలో 
గుర్రాల స్వామి జిల్లాపార్టీ కౌన్సిల్ మెంబెర్ గౌరారం కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి బోనాల రాజు, యువ మోర్చా మాజీ అధ్యక్షులు ఈసాల నవీన్, పార్టీ సీనియర్ నాయకులు సదానంద గౌడ్,రెడ్డమైన లింగం దాసరి స్వామి రెడ్డమైన నాగరాజు చింతల కర్ణాకర్ మూష్ణం నాగరాజు చిన్న రాజు గాని రాజయ్య  రాజకుమార్ తిప్పారం బూత్ అధ్యక్షులు గడ్డం శేఖర్ రాజు అఖిల్ చందు నరసింహారెడ్డి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.