BREAKING
స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* కేంద్ర సీఇసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు. పొన్నూరులో రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష గీతంలో డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తి మూట్‌కోర్టు పోటీల ముగింపు ... విజేతగా సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం రైతుబజార్ లో కమర్షియల్ షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం! త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి* పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలి ఆర్డీవో చిన్నయ్య నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి

రహదారుల పక్కన ప్రమాదకరంగా మారిన కంపచెట్లు తొలగించాలి

Select Suryaa Now
రహదారుల పక్కన ప్రమాదకరంగా మారిన కంపచెట్లు తొలగించాలి

 

-బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ పులికంటి లక్ష్మయ్య

మాడ్గుల మండల కేంద్రం నుండి ఆమనగల్లు పట్టణంలోని శ్రీశైలం - హైద్రాబాద్ జాతీయరహదారికి అనుసంధానంగా ఏర్పాటుచేసిన ఆర్ అండ్ బి డబుల్ రోడ్డులో మాడ్గుల చెరువుకట్ట వెనుక,బంగారుగడ్డ, అవురుపల్లి ముత్యాలమ్మ  దేవాలయ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా కంపచెట్లు పెరిగి ప్రమాదకంగా మారాయని , అదే విధంగా మాడ్గుల - దేవరకొండ పిడబ్లుడి ప్రధాన రహదారిలో ఉన్న బ్రాహ్మణపల్లి , ఆర్కపల్లి గ్రామాల సమీపంలో కంపచెట్లు పెరిగి తరుచూ వాహనదారులు, ఆటోల్లో ప్రయాణించేవారు గాయాలకు గురవుతున్నారని  బ్రాహ్మణపల్లి మాజీ సర్పంచ్ పులికంటి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రహదారుల పక్కన ప్రమాదకరంగా మారిన కంపచెట్ల తొలగింపు మొదలు రహదారుల నిర్వాహణ ను సంబంధితశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం మూలంగా ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.  ఇప్పటికైనా ఆర్ అండ్ బి, పంచాయతిరాజ్ శాఖ, మండల అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని మాజీ సర్పంచ్ కోరారు. లేని పక్షంలో ప్రజల సమస్య పట్ల అధికారుల ఉదాసీనతను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం రహదారుల పక్కన ప్రమాదకరంగా మారిన కంపచెట్ల గురించి ఆయన మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ వెల్లడించారు.

---------

ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల