BREAKING
స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* కేంద్ర సీఇసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు. పొన్నూరులో రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష గీతంలో డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తి మూట్‌కోర్టు పోటీల ముగింపు ... విజేతగా సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం రైతుబజార్ లో కమర్షియల్ షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం! త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి* పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలి ఆర్డీవో చిన్నయ్య నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి

జగ్గయ్యపేటలో రాష్ట్రస్థాయి గట్కా, టాంగ్టా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

Select Suryaa Now
జగ్గయ్యపేటలో రాష్ట్రస్థాయి గట్కా, టాంగ్టా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

జగ్గయ్యపేటలో రాష్ట్రస్థాయి గట్కా, టాంగ్టా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

12 జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు – అండర్-17, అండర్-19 విభాగాల్లో బాలురు, బాలికలకు పోటీలు

జగ్గయ్యపేట మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట పట్టణంలోని గంటేల శకుంతలమ్మ కళాశాల ఇండోర్ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గట్కా, టాంగ్టా పోటీలను జగ్గయ్యపేట శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రారంభించారు.

ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 12 జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్-17, అండర్-19 విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య  మాట్లాడుతూ 

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణ ద్వారా యువ క్రీడాకారుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుందని, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు.

జగ్గయ్యపేట పట్టణంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ గంటా వెంకటేశ్వర్లు, అబ్జర్వర్ కె. శివ, జోస్నా మరియు క్రీడా నిర్వాహకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు,12 జిల్లాల క్రీడాకారులు సుమారు 500 మంది మరియు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా