విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి
సూర్య మంచిర్యాల టౌన్ :
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు వేంపల్లిలోని అభ్యస జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్‌ఐ ఉషారాణి విద్యార్థులతో కలిసి పాల్గొని సందడి చేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉషారాణి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేకతను చాటిచెప్పే ఈ పండుగను మహిళలు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషకరమన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, తమ హక్కుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి అన్నారు.మహిళల భద్రత, రక్షణ కోసం షీ టీమ్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా ముందుకు వచ్చి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది జ్యోతి, రాజేందర్, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.