సూర్య తిర్యాణి : తిర్యాణి మండలం ఎదులపాడ్ గ్రామానికి చెందిన చిక్రం శ్రీనివాస్ అక్టోబర్ 8న గురువారం రాత్రి 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గ్రామంలో ఐకేపీ సీఏగా కొన్నేళ్లపాటు విధులు నిర్వహించిన ఆయన మరణం పట్ల గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ అందించిన సేవలు మరువలేనివని, ఆయన తమ మధ్య లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
శ్రీనివాస్ కుటుంబానికి అండగా నిలిచేందుకు గ్రామస్థులు తమ వంతు సహాయం అందించారు. స్థానిక సర్పంచ్ మడావి పార్వతి అంబరావు 25 కిలోల బియ్యం, మాజీ సర్పంచ్ మాడావి గోపాల్ 25 కిలోల బియ్యం అందజేశారు. గ్రామస్థుల తరఫున మొత్తం రూ.4,400 ఆర్థిక సహాయాన్ని శ్రీనివాస్ తమ్ముళ్లు చిక్రం తిరుపతి, దశ్రులకు అందించారు.ఈ కార్యక్రమంలో కొట్నాక యశ్వంత్ రావు, చిక్రం జంగు, మాడావి మధుకర్, రాజందర్, రామకృష్ణ, రాజేష్, చిరంజీవి, తిరుపతి, చిక్రం కిష్టు, అడా కిరణ్, సిడం కిసన్, పంద్రం సురేష్ తదితరులు పాల్గొన్నారు.