BREAKING
అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ఆదిమళ్ళ కోటేశ్వరరావు కి నివాళులు అర్పించిన తన్నీరు

బతుకమ్మలతో.. పాఠశాల ప్రాంగణం కళకళ!

Select Suryaa Now
బతుకమ్మలతో.. పాఠశాల ప్రాంగణం కళకళ!

చౌటుప్పల్‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మున్సిపల్‌ చైర్మన్‌ మొగుదాల పావని రమేష్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాలలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పావని రమేష్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీక అని అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే పండుగల విశిష్టతను తెలుసుకోవడంతోపాటు, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందించుకోవాలని సూచించారు.పాఠశాల కరస్పాండెంట్‌ గుత్తా గోపాల్‌రెడ్డి కవిత మాట్లాడుతూ.. విద్యతోపాటు విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థినులకు తెలియజేస్తూ, మన సంప్రదాయాలను కాపాడుకోవాలనే భావనను వారిలో పెంపొందిస్తున్నామన్నారు.విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ వేడుకల్లో సందడి చేశారు. పూలతో అలంకరించిన బతుకమ్మలతో పాఠశాల ప్రాంగణం కళకళలాడింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉయ్యాల రమేష్ మరియు అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.