BREAKING
స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* కేంద్ర సీఇసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు. పొన్నూరులో రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష గీతంలో డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తి మూట్‌కోర్టు పోటీల ముగింపు ... విజేతగా సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం రైతుబజార్ లో కమర్షియల్ షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం! త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి* పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలి ఆర్డీవో చిన్నయ్య నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి

మద్దతు ధరను మించి పలికిన రేటు! -ఒక్కరోజే 12,971 బస్తాల ధాన్యం రాక -సన్న రకానికి గరిష్ఠంగా రూ.3,710, -కందులకు రూ.9,870

Select Suryaa Now
మద్దతు ధరను మించి పలికిన రేటు! -ఒక్కరోజే 12,971 బస్తాల ధాన్యం రాక -సన్న రకానికి గరిష్ఠంగా రూ.3,710,  -కందులకు రూ.9,870

మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం 

-దళారులను నమ్మి మోసపోవద్దు
-చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్


తిరుమలగిరి అక్టోబర్ 09 మేజర్ న్యూస్ :- తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం భారీగా ధాన్యం చేరింది. రైతులు తెచ్చిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, ఐకేపీ కేంద్రాల బోనస్ కంటే భారీగా అదనపు ధర పలికినట్లు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎల్సోజు చామంతి నరేష్ తెలిపారు. శుక్రవారం మార్కెట్ యార్డులో పంట అమ్మకాలను ఆమె స్వయంగా పరిశీలించి, రైతులతో మాట్లాడి ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ తిరుమలగిరి మార్కెట్ యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగాం, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట వంటి ఐదు జిల్లాల సరిహద్దుల్లో ఉండటంతో వివిధ ప్రాంతాల నుండి రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ కు ధాన్యాన్ని తరలిస్తున్నారని చెప్పారు. గత సంవత్సరం సన్నాలకు బోనస్‌తో కలిపి రూ.2,883 ధర ఉండగా, ఈసారి మార్కెట్లో అంతకంటే చాలా ఎక్కువ రేటు లభిస్తోందన్నారు.

ధరల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
• సన్న ధాన్యం: మార్కెట్లో సన్న రకానికి మద్దతు ధర కంటే రూ.600 నుండి రూ.1,000 వరకు అదనంగా లభిస్తోంది. శుక్రవారం నాడు సన్నాలకు గరిష్ఠంగా రూ.3,710, కనిష్ఠంగా రూ.3,300 ధర పలికింది.
• దొడ్డు ధాన్యం: దొడ్డు రకానికి గరిష్ఠంగా రూ.2,961 కాగా, కనిష్ఠంగా రూ.2,401 ధర వచ్చింది.
• కందులు: కందులకు కూడా ఊహించని రీతిలో క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.9,870 ధర పలికింది.

దళారులను నమ్మొద్దు:

మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని చైర్ పర్సన్ తెలిపారు. అందుకే రైతులు ఇక్కడికి రావడానికే మొగ్గు చూపుతున్నారని, శుక్రవారం ఒక్కరోజే 12,971 బస్తాల ధాన్యం దిగుమతి అయిందని వివరించారు. రైతులు ఎవరూ దళారుల బారిన పడి నష్టపోవద్దని, నేరుగా మార్కెట్ యార్డుకే వచ్చి తమ పంటను అమ్ముకొని లాభాలు పొందాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో  మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు రాపాక సోమేష్, దొడ్డ రమేష్, మార్కెట్ కార్యదర్శి షంషీర్, మార్కెట్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.