BREAKING
డాక్టర్ కణితి విశ్వనాథం విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించండి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తపస్ హైస్కూల్ విద్యార్థులు అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు

నేటి నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ - సంబరాలకు సిద్ధమవుతున్న మహిళలు

Select Suryaa Now
నేటి నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ -  సంబరాలకు సిద్ధమవుతున్న మహిళలు
సూర్య, జన్నారం : జన్నారం మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాలకు మహిళలు సిద్ధమౌతున్నారు. దసరా పండుగ వేళ తెలంగాణ ఆడపడుచులు ఆడే బతుకమ్మ పండుగ విశిష్టతను వివరిస్తూ బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి పూల అందాలకు మరియు ప్రకృతి విశిష్టతకు ప్రత్యేకంగా నిలిచే అద్భుతమైన పండుగ. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు మహిళలు ప్రకృతితో మమేకమై జరుపుకునే ఒక విశిష్టమైన వేడుక అని అంటున్నారు. ఈ వేడుకలు ఈ నెల 10న ప్రారంభమై 18న ముగుస్తాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 11న అటుకుల బతుకమ్మ, 12న ముద్దపప్పు బతుకమ్మ, 13న నానే బియ్యం బతుకమ్మ, 14న అట్ల బతుకమ్మ, 15న అలిగిన బతుకమ్మ, 16న వేపకాయల బతుకమ్మ, 17న వెన్నెముద్దల బతుకమ్మ, చివరి రోజు అయిన 18న సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు. చివరి రోజు ఆడపడుచులు ఉదయం నుంచి బతుకమ్మలను రకరకాల రంగు రంగుల పూలతో పేర్చడంలో నిమగ్నమవుతారు. బతుకమ్మలను తయారు చేయడానికి చామంతి, గడ్డి పూలు, గులాబి, తంగేడు, గునుగు, కటకట్ల వంటి నానారకాల పూలను సేకరిస్తారు. కంచంలో లేదా రాగి తాంబూలాలలో గుండ్రంగా పిరమిడ్ ఆకారంలో పూలను అనేక రంగుల వారీగా పేరుస్తారు. పేర్చిన బతుకమ్మల పైన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి సాయంత్రం వేళలో తమ తమ ఇళ్లలో పేర్చుకున్న బతుకమ్మను ఒక్కచోటికి తీసుకువచ్చి గంటల తరబడి మహిళలు బతుకమ్మ పాటలు పాడుతుంటారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మహిళల సంబరాలు అంబరాన్నంటాయి. చివరికి బతుకమ్మలను తలపై పెట్టుకుని కొంత దూరం వెళ్లి అక్కడ పెట్టుకొని కొద్దిసేపు ఆడి సమీపంలో గల వాగులు, వంకలు, గోదావరి నదులలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. అనంతరం వెంట తెచ్చుకున్న సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. తిరుగు ప్రయాణంలో సైతం బతుకమ్మ పాటలను పాడుకుంటూ వస్తుంటారు.
 *హోరెత్తిన ముందస్తు బతుకమ్మ సంబరాలు* 
బతుకమ్మ వేడుకలకు ముందస్తుగానే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినిలు పాడిన పాటలు ఆడిన ఆటలతో అందర్నీ ఆకట్టుకున్నారు. జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు కిష్టాపూర్ కస్తూర్బా పాఠశాల అలాగే కవ్వాల్ గిరిజన ఆశ్రమం బాలికల ఉన్నత పాఠశాల, అక్కపెళ్లి గూడ ప్రాథమిక పాఠశాల, రాఘవేంద్ర లిటిల్ హాన్స్ హై స్కూల్, కలమడుగు వివేకానంద పాఠశాల విద్యార్థులు బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. అనంతరం సమీపంలో గల వాగులలో, చెరువులలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.