తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలి...
ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి
కావలి, మేజర్ న్యూస్ : కావలి సర్ పేరుతో అర్హులైన ఓటర్ల ఓట్లను అక్రమంగా తొలగించిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కావలి పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా సిపిఐ నేత బిళ్ళా పురుషోత్తం మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితా వెన్నుముక అని ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ సర్ పేరుతో బిజెపి సర్కార్ కు అనుకూలంగా ఏకపక్షంగా 13.39 కోట్ల మంది భారతీయుల ఓటు హక్కు లేని పౌరులుగా మార్చేశారని సర్ పేరుతో ఓటు హక్కు కలిగిన పౌరుల ఓట్లను ఏకపక్షంగా తొలగించడం దుర్మార్గమైన చర్య అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో కులం మతం ప్రాంతం జాతితో నిమిత్తం లేకుండా 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని తెలిపారు ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన విధంగా ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయాలని దేశ ప్రజల ముందు ఎన్నికల కమిషన్ దోషిగా నిలబడ్డారన్నారు ఓటు హక్కును కాపాడుకోవడం కోసం ప్రజలు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నేటి పాలకులు తీసుకొచ్చారని రాజ్యాంగానికి విరుద్ధంగా సర్ ప్రక్రియ ఉందని తక్షణమే రద్దు చేయాలని తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని అర్హులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ఓటు చోరీకి పాల్పడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోం శాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ కావలి పట్టణ అధ్యక్ష కార్యదర్శి మండ్ల వెంకటేశ్వర్లు కె చంద్రశేఖర్ సిపిఐ కావలి డివిజన్ సహాయ కార్యదర్శి దమ్ము దర్గా బాబు సిపిఐ నాయకులు డాక్టర్ మారుతీ రావు పుల్ల ఆదినారాయణ పి చలమయ్య చేవూరు కొండయ్య డిఎం కొండయ్య వై మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు