స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఘన స్వాగతం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: యూరప్ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు వికారాబాద్‌లో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, జర్నలిస్టులు ఘన స్వాగతం పలికారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వచ్చిన స్పీకర్‌ను శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ శాసన వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తూ సీపీఏ కార్యక్రమాల్లో పాల్గొనడం రాష్ట్రానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, శాసన వ్యవస్థ ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు దుర్గ మల్లికార్జున గౌడ్, కొప్పుల రామకృష్ణ రెడ్డి, బి. వినోద్, హిరేకర్ రాకేష్, నాయకులు మున్నూర్ శ్రీకాంత్, కాకి నాగరాజ్, మాల శ్రీకాంత్, బాదం అశోక్, మధుకర్, బాలకృష్ణ, ముడావత్ శ్రీకాంత్ నాయక్, టీయూడబ్ల్యూజే–ఐజేయూ వికారాబాద్ నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ జాక వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.