BREAKING
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తపస్ హైస్కూల్ విద్యార్థులు అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం జడ్పీ సీఈవో గా మధుసూదన్ శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నేటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు పెదవేగిలో ఘనంగా 70వ ఏపీ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం ముఖ్య అతిథిగా పాల్గొన్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని

ఘనంగా బతుకమ్మ సంబరాలు.

Select Suryaa Now
ఘనంగా బతుకమ్మ సంబరాలు.

 చింతపల్లి మేజ న్యూస్ . ది రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యార్థులతో బతుకమ్మ సంబరాలు ఘనంగా చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తో బతుకమ్మ ఆట ఆడించారు. ది రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్ ప్రిన్సిపాల్ వీరేశం  మాట్లాడుతూ... బతుకమ్మ అంటే కేవలం పూల పండుగ మాత్రమే కాదు ,అది మన బతుకును ఇచ్చే ప్రకృతిని, చెరువులను, మట్టిని ఆరాధించే ఒక గొప్ప సంస్కృతి. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి తీరొక్క పూలతో గౌరమ్మను కొలుస్తూ, తొమ్మిది రోజుల పాటు సాగే ఈ వేడుక మన గ్రామీణ జీవన సౌందర్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది.
మన కాకతీయ రాజుల కాలం నుండి, మన జీవనాధారమైన చెరువులను కాపాడుకుంటూ, వాటికి కృతజ్ఞతగా పూలతో బతుకమ్మను చేసి నీటిలో నిమజ్జనం చేసే గొప్ప సంప్రదాయం ఇది. "బతుకు అమ్మ" — అంటే  మన బతుకును బతికించే అమ్మగా గౌరమ్మను పూజిస్తాం. ఈ పండుగ మనలో ఐక్యతను, ఆనందాన్ని, తోబుట్టువుల అనుబంధాన్ని మరింత పెంచుతుంది  అన్నారు. 
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  శంకర్, సత్యనారాయణ, పిఈటి.రమేష్ , అధ్యాపకులు , పాఠశాల సిబ్బంది , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.