telanagana
వేలాడుతున్న చెట్టు కొమ్మ తొలగింపు.. స్పందించిన ఉట్నూర్ సర్పంచ్
సూర్య ఉట్నూర్, అక్టోబర్ 9: ఉట్నూర్ నుంచి ఎక్స్‌రోడ్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై హర్కపూర్ గ్రామం సమీపంలో ప్రమాదకరంగా వేలాడుతున్న భారీ చెట్టు కొమ్మను ఉట్నూర్ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ చొరవతో తొలగించారు.రహదారిపై వేలాడుతున్న ఈ కొమ్మ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ‘జనంసాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఉట్నూర్ సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్ తక్షణమే స్పందించారు. అధికారులతో మాట్లాడి, సిబ్బంది సహాయంతో రోడ్డుపై వేలాడుతున్న కొమ్మను తొలగించి వాహనదారుల రాకపోకలకు మార్గాన్ని సుగమం చేశారు. ప్రమాదం జరగకముందే వేగంగా స్పందించి చర్యలు తీసుకున్న సర్పంచ్ జాదవ్ అనిత శ్రీనివాస్‌కు స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.