telanagana
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ - విద్యార్థి విద్యాసంస్థల అధ్యర్యంలో బతుకమ్మ సంబురాలు
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : పట్టణంలోని మావలలో విద్యార్థి విద్యా సంస్థల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మావల ఎం ఈ ఓ అడే సరోజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎం ఈ ఓ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా ఈ పండుగను నిర్వహిస్తానీ అన్నారు.అలాగే విద్యార్థి విద్యాసంస్థల యజమానురాలు బోరంచు బీనదేవి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐకమత్యానికి ప్రతీకగా నిలుస్తుంది. పూలను పూజించడం ద్వారా ప్రకృతి ప్రాముఖ్యతను చాటిచెప్పే ఈ పండుగ పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని కూడా అందిస్తుందని గ్రామాలు, పట్టణాల్లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తారని సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటారని అన్నారు.తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే బతుకమ్మ పండుగను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ, పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఇట్టి కార్యక్రమంలో విద్యార్థి బి ఈ డి, డిగ్రీ, జూనియర్ కళాశాల, శ్రీనివాస రామానుజ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు అధ్యాపకురాళ్లు పాల్గొన్నారు