BREAKING
అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు హెడ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి మహిళాగ్రూపుల సభ్యురాండ్లు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి తవ్వారు.... వదిలేశారు సమష్టి కృషితోనే మున్సిపల్‌ విజయం విద్యుత్‌ కోతలపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, చిప్పలపల్లి మహేందర్ నాథ్.* బతుకమ్మలతో.. పాఠశాల ప్రాంగణం కళకళ! మెట్టపల్లి, పేరిపి గ్రామాలను ఆకస్మికంగా సందర్శించిన తహసిల్దార్ సమ్మేటివ్‌-1 జవాబు పత్రాల మూల్యాంకనం తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలి... ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు.. లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నేటి నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ - సంబరాలకు సిద్ధమవుతున్న మహిళలు మద్దతు ధరను మించి పలికిన రేటు! -ఒక్కరోజే 12,971 బస్తాల ధాన్యం రాక -సన్న రకానికి గరిష్ఠంగా రూ.3,710, -కందులకు రూ.9,870 విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే మెరుగైన చికిత్స లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: డాక్టర్ మచ్చ కిరణ్ కుమార్

986(1)ఏ సర్వే నంబర్ భూముల సమస్యకు పరిష్కారం.. 100 కుటుంబాలకు ఊరట!

Select Suryaa Now
986(1)ఏ సర్వే నంబర్ భూముల సమస్యకు పరిష్కారం.. 100 కుటుంబాలకు ఊరట!

సూర్య అద్దంకి.

986(1)ఏ సర్వే నంబర్‌కు సంబంధించిన భూముల వివాదంపై అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న వంద కుటుంబాలకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఈ సర్వే నంబరులోని సుమారు 5 ఎకరాల ఓనర్స్ ల్యాండ్ 22ఏ నిషేధిత జాబితాలో పడటంతో గత 10-15 ఏళ్లుగా భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బాధితుడు గార్లపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఆ భూములు అమ్ముకోవడానికి వీలులేక, బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోడానికి కుదరక, పిల్లల పెళ్లిళ్లు, చదువుల వంటి అత్యవసర అవసరాలకు కూడా ఆర్థికంగా నానా పాట్లు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఆదేశాల మేరకు పూర్తి రికార్డులను సేకరించి ఎంఆర్ఓ కార్యాలయం ద్వారా ఒంగోలు ఆర్డీఓ మరియు కలెక్టర్ కార్యాలయానికి నివేదికలు సమర్పించడం జరిగింది. ఏసీ ఆఫీస్ నుంచి కూడా ఇవి మా భూములు కావలి స్పష్టం చేసే అన్ని ఫైళ్లను పరిశీలించి మంత్రికి అందజేశారు.   
దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి మరియు సంబంధిత అధికారులు దేవాదాయ భూముల నిషేధిత జాబితా నుంచి 986(1)ఏ భూమిని తొలగించి, బోనస్ లాండ్‌గా మార్చారు. దీనివల్ల దాదాపు వంద కుటుంబాలకు దక్కిన ఈ ఊరట పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ.. మంత్రులు గొట్టిపాటి రవికుమార్,  ఆనం రామనారాయణ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.