BREAKING
స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్, ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* కేంద్ర సీఇసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి.. రౌండ్ టేబుల్ సమావేశంలో కొత్తపల్లి వెంకటరమణ డిమాండ్ ఘనంగా విశిష్ట విద్య ప్రదాత పురస్కారం నేరాల నియంత్రణ, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కార్డెన్ సెర్చ్. సి. ఐ నాగమల్లేశ్వరరావు. పొన్నూరులో రెవెన్యూ శాఖ అధికారులతో ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ సమీక్ష గీతంలో డా.ఎమ్.వి.వి.ఎస్ మూర్తి మూట్‌కోర్టు పోటీల ముగింపు ... విజేతగా సింబయాసిస్ న్యాయ విశ్వవిద్యాలయం రైతుబజార్ లో కమర్షియల్ షాపుల కేటాయింపునకు దరఖాస్తుల ఆహ్వానం! త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట మైన ముందస్తు ఏర్పాట్లు చేయాలి* పకడ్బందీగా ఎన్నికల నిర్వహించాలి ఆర్డీవో చిన్నయ్య నూతనకల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు జనసేనలోకి 60 కుటుంబాల యువత చేరిక నోబుల్ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అగ్రహం -- తక్షణమే నోబుల్ ని విడుదల చేయాలని నాయకుల డిమాండ్ మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ముందస్తు సన్నద్ధతతో ఉండాలి వివేకానంద స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు రాబోయే మున్సిపల్ ఎన్నికలపై మాజీ కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం.. పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంభంగి

చిలకలూరిపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం.. రూ.59 లక్షల పనులకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి

Select Suryaa Now
చిలకలూరిపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం.. రూ.59 లక్షల పనులకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి

సూర్య న్యూస్ చిలకలూరిపేట: 

పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.నియోజకవర్గ అభివృద్ధి ఒకెత్తయితే,చిలకలూరిపేట పట్టణ అభివృద్ధి మరో ఎత్తు అని పేర్కొన్నారు.పట్టణ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని వెల్లడించారు.శుక్రవారం చిలకలూరిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో హెచ్‌ఏఎం నిధులు రూ.59 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులకు ప్రత్తిపాటి పుల్లారావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రహదారులు,డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధితో పాటు తాగునీరు,వీధి దీపాలు,పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పార్కుల సుందరీకరణ,శ్మశానవాటికల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.విద్య,వైద్య రంగాల్లోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.పట్టణంలోని ప్రతి వార్డులో అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని హామీ ఇచ్చారు.

శంకుస్థాపన చేసిన పనుల వివరాలు:

9వ వార్డులో నిదానంపాటి అమ్మవారి ఆలయం వద్ద రూ.9 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం,11వ వార్డులో రూ.11 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం,18వ వార్డులో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టనున్నారు.అదేవిధంగా 13వ వార్డు మొదటి లైనులో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు,డ్రైనేజీల నిర్మాణం,అదే వార్డులో నాలుగో లైనులో రూ.9 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు.14వ వార్డులో రూ.15 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.