పేదలు, గర్భిణులకు భోజన వితరణ పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ
నరసరావుపేట మేజర్ న్యూస్ : మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్త తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజలకు, గర్భిణీ మహిళలకు శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని లింగంగుంట్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజలకు, గర్భిణీ మహిళలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమన్నారు. పేదలకు సేవ చేయడం, గర్భిణీ మహిళలకు ఆహారం అందించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను సేవా కార్యక్రమాల రూపంలో స్మరించుకోవడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్త, ఆయన కుమారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ మల్లికార్జున్