11న ఉచిత కంటి వైద్య శిబిరం
గజపతినగరం, సూర్య : మండలం కేంద్రంలోని గంగరాజు థియేటర్ ఎదురుగా ఉన్న నేత్రాలయ ఐ కేర్ వద్ద ఈ నెల 11వ తేదీ ఆదివారం నాడు ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు గాడి మౌనిక తెలిపారు.ఈ శిబిరంలో కంటి సంబంధిత సమస్య ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు చేసి,అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు కూడా ఉచితంగా చేయనున్నట్లు ఆమె తెలిపారు.శిబిరానికి వచ్చేవారు ఆధార్ కార్డు,ఆరోగ్యశ్రీ కార్డు,మొబైల్ నెంబర్ తీసుకొని రావాలని,,ఈ అవకాశాన్ని పరిసర ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.