BREAKING
అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు హెడ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి తవ్వారు.... వదిలేశారు సమష్టి కృషితోనే మున్సిపల్‌ విజయం విద్యుత్‌ కోతలపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, చిప్పలపల్లి మహేందర్ నాథ్.* బతుకమ్మలతో.. పాఠశాల ప్రాంగణం కళకళ! మెట్టపల్లి, పేరిపి గ్రామాలను ఆకస్మికంగా సందర్శించిన తహసిల్దార్ సమ్మేటివ్‌-1 జవాబు పత్రాల మూల్యాంకనం తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలి... ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు.. లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నేటి నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ - సంబరాలకు సిద్ధమవుతున్న మహిళలు మద్దతు ధరను మించి పలికిన రేటు! -ఒక్కరోజే 12,971 బస్తాల ధాన్యం రాక -సన్న రకానికి గరిష్ఠంగా రూ.3,710, -కందులకు రూ.9,870 విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే మెరుగైన చికిత్స లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: డాక్టర్ మచ్చ కిరణ్ కుమార్

జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా గోసంగి కిషన్ నియామకం

Select Suryaa Now
జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా గోసంగి కిషన్ నియామకం

 

- పార్టీ బలోపేతానికి, దళిత వర్గాల హక్కుల సాధనకు అంకితభావంతో పనిచేస్తా...గోసంగి కిషన్

- అధిష్టానం, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ముందుకు

లింగాలఘణపూర్ ప్రతినిధి,

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్‌గా గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ కార్యకర్త గోసంగి కిషన్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్సీ విభాగం కమిటీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందజేశారు.*ఈ సందర్భంగా గోసంగి కిషన్ మాట్లాడుతూ...* సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న తన సేవలను గుర్తించి ఈ గురుతర బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి, సీనియర్ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకానికి సంపూర్ణ మద్దతునిచ్చి ఆశీర్వదించిన...స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ నాయకులు ఎర్రబెల్లి స్వర్ణ , కొమ్మూరి ప్రతాప్ రెడ్డి,జనగామ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ వేముల మల్లేశం మహారాజ్,స్టేషన్ ఘన్‌పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ సింగపురం ఇందిర,కాంగ్రెస్ సీనియర్ నాయకులు శశిరేందర్,మరియు ఇతర ముఖ్య నాయకులకు, సహచర కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...*

రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా, ప్రజా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తానని స్పష్టం చేశారు. జిల్లాలోని ఎస్సీ వర్గాల సంక్షేమానికి, వారి హక్కుల పరిరక్షణకు శక్తివంచన లేకుండా శ్రమిస్తానని, రాబోయే రోజుల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని ఆయన వివరించారు.గోసంగి కిషన్ నియామకం పట్ల పలువురు మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.