ఉన్నత పాఠశాలకు క్రీడా పరికారలు
గూడూరు, మేజర్‌న్యూస్ : గూడూరు పట్టణం పరిధిలోని చవటపాళెం ఉన్నత పాఠశాలకు పిఆర్ క్లబ్ ఆద్వర్యంలోక్రీడా పరికరాలు అందచేశారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని పిఆర్ క్లబ్ (పెళ్లేటి రామిరెడ్డి క్లబ్) ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు లింగారెడ్డి జయరామిరెడ్డి జ్ఞాపకార్థం దివిపాలెం పంచాయతీలోని చవటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడా పరికరాలు అందచేశారు. ఈ సందర్భంగా క్లబ్ కార్యదర్శి ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పిఆర్ క్లబ్ సభ్యులైన లింగారెడ్డి జయరామిరెడ్డి జ్ఞాపకార్డు చవటపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థులందరూ చక్కగా చదువుకొని క్రీడల్లో రాణించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్, క్లబ్ సభ్యులు ఎం శ్రీనివాసులరెడ్డి, ఎస్‌ఎల్‌ఎన్ బాబు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు.