BREAKING
అశ్వారావుపేటలో రాష్ట్ర స్థాయి అండర్‌–20 బాలికల జూనియర్ కబడ్డీ పోటీలు హెడ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి తవ్వారు.... వదిలేశారు సమష్టి కృషితోనే మున్సిపల్‌ విజయం విద్యుత్‌ కోతలపై రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, చిప్పలపల్లి మహేందర్ నాథ్.* బతుకమ్మలతో.. పాఠశాల ప్రాంగణం కళకళ! మెట్టపల్లి, పేరిపి గ్రామాలను ఆకస్మికంగా సందర్శించిన తహసిల్దార్ సమ్మేటివ్‌-1 జవాబు పత్రాల మూల్యాంకనం తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలి... ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు.. లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం నేటి నుండి ప్రారంభం కానున్న బతుకమ్మ - సంబరాలకు సిద్ధమవుతున్న మహిళలు మద్దతు ధరను మించి పలికిన రేటు! -ఒక్కరోజే 12,971 బస్తాల ధాన్యం రాక -సన్న రకానికి గరిష్ఠంగా రూ.3,710, -కందులకు రూ.9,870 విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే మెరుగైన చికిత్స లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు.. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి: డాక్టర్ మచ్చ కిరణ్ కుమార్

సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని శుక్రవారం కందుకూరు మండలం నేదునూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెయింట్ మేరీ ప్రావిన్స్ ప్రావిన్షియల్ సుపీరియర్ ఫాదర్ బిబిన్ జార్జ్, పాఠశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ జోనేష్ హాజరయ్యారు. వారితో పాటు ఫాదర్ కిషోర్, బ్రదర్ కిరణ్, ప్రిన్సిపాల్ శాంతిని ప్రియా, ఉపాధ్యాయులు ప్రసాద్, అరుణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ విశిష్టతను వివరించారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మ ప్రకృతిని, పూలను ఆరాధిస్తూ మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకునే గొప్ప సాంస్కృతిక వేడుక అని పేర్కొన్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.విద్యార్థినులు సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఆడిపాడడంతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతో పాటు వాటి పరిరక్షణకు ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

టి. శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు