BREAKING
చిక్రం శ్రీనివాస్ కుటుంబానికి గ్రామస్థుల ఆర్థిక సహాయం జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా గోసంగి కిషన్ నియామకం ఉన్నత పాఠశాలకు క్రీడా పరికారలు ఏర్పుమల్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు రహదారిని కమ్మేసిన ముళ్ళ పొదలు వేలాడుతున్న చెట్టు కొమ్మ తొలగింపు.. స్పందించిన ఉట్నూర్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై రేపు కేబినెట్ లో చర్చ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 986(1)ఏ సర్వే నంబర్ భూముల సమస్యకు పరిష్కారం.. 100 కుటుంబాలకు ఊరట! రైతుల కష్టాలు చూసి చలించిన మాతృహృదయం.. సొంత ఖర్చులతో డొంక దారి బాగు చేసిన పోకల శ్రీనివాసరావు అశ్వారావుపేటలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం* మసీదు సమీపంలో మద్యం దుకాణం వద్దు.. స్థానికుల నిరసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఘన స్వాగతం నారాయణ స్కూల్‌లో ముందస్తు దసరా సంబరాలు వేద పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

ప్రొద్దుటూరు లో కొత్త ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం

Select Suryaa Now
ప్రొద్దుటూరు లో కొత్త ఆర్టీసీ బస్టాండ్ ప్రారంభం

 ప్రొద్దుటూరు మేజర్ న్యూస్: ప్రొద్దుటూరులో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ను శుక్రవారం రాష్ట్ర రవాణా శాఖ  మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకంలో ఇప్పటికి 100 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి అయ్యాయని తెలిపారు. మన రాష్ట్రానికి 750 ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయని, రాష్ట్రంలో కొనుగోలు చేసే ప్రతి బస్సు ,  ఎలక్ట్రికల్ ఏసీ బస్సులే అని తెలిపారు. గ్రామస్థాయిలో పల్లె వెలుగు బస్సు కూడా ఏసీ బస్సు లు ,  శ్రీ శక్తి బస్సులు కూడా ఏసి బస్సులే ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి వివరించారు. గత ప్రభుత్వంలో ఏ విధమైన అభివృద్ధి ,  సంక్షేమం జరిగింది అందరికీ తెలుసన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి 42 కోట్లు అభివృద్ధికి ముఖ్యమంత్రి మంజూరు చేశారని, ప్రొద్దుటూరులో ప్రస్తుతం ఉన్న పాత బస్టాండ్ ను మాస్టర్ ప్లాన్ తో అభివృద్ధి చేస్తామని, ప్రొద్దుటూరు పట్టణానికి క్రీడ మైదానం కొరకు సంబంధించి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తారని ఎమ్మెల్యే చెప్పారు ,  మంచి స్టేడియం నిర్మిస్తామని తెలిపారు.

  • షేక్ మహమ్మద్ రఫీ ప్రొద్దుటూరు వైఎస్సార్ కడప జిల్లా