వేద పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
వేద పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
కుకునూరుపల్లి,మేజర్ న్యూస్.....మండల కేంద్రమైన కుకునూరుపల్లిలోని వేద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అంగరంగ వైభవంగా ముందస్తు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి ఉపాధ్యాయులు బతుకమ్మ ఉత్సవాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబరాల విద్యార్థుల ఆట,పాటలు అలరించాయి. ఈ కార్యక్రమాల్లో కరస్పాండెంట్ పసల సంతోష్ డైరెక్టర్ శోభారాణి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.