BREAKING
అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ* *అందమైనబతుకమ్మలతోపోటీపడినమహిళలు* *సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం

Select Suryaa Now
రైతు పక్షపాతి కూటమి ప్రభుత్వం

 రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ....  అధికారంలోకి రాగానే ల్యాండ్ యాక్ట్ రద్దు చేశాం .... రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం  ..... కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
బుచ్చిరెడ్డిపాలెం,మేజర్ న్యూస్  :  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో జరిగిన రైతుల పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ల్యాండ్ యాక్ట్ రద్దు చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారని అలాగే తాము అధికారంలోకి రాగానే రద్దు చేయడం జరిగిందన్నారు. రైతులు ఎప్పటికీ ఇబ్బంది పడకుండా రీ సర్వే జరిపించి రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దే నన్నారు. దీనికి డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గ రైతులందరి తరపున ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ప్రతి మండలంలో రీ సర్వే జరిపి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందివ్వడం జరిగిందన్నారు. రైతులకు ఈ సంవత్సరం పంట కోసినదగ్గర నుండి తమ ధాన్యం అమ్మే వరకు మంచి జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తాము పండించిన పంటకు తగినంత గిట్టుబాటు ధర ఉండటంతో రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎల్ ని నో సమస్య వల్ల ఎండలు అధికంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం వరుణ యాగాలు చేయించడం జరిగిందని, త్వరలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఎమ్మెల్యే జ్యోస్యం చెప్పారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు, తరలించేందుకు వీలుగా నియోజకవర్గంలో అవసరమైన ప్రతి చోట జడ్జిలు నిర్మించడం జరిగిందన్నారు. తమ ప్రాంతంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే రైతు సోదరులు తన దృష్టికి తీసుకువస్తే వాటిని కూడా పూర్తి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అందుబాటులో ఉన్న నీటిని బట్టి రైతులు పంటలు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, మున్సిపల్ చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, టిడిపి నాయకులు మోర్ల మురళి, ఏటూరి శివరామకృష్ణారెడ్డి, నీటి సంఘం అధ్యక్షులు బత్తల హరికృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్ వింజం రామానాయుడు, మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా పాల్గొన్నారు.