BREAKING
చిక్రం శ్రీనివాస్ కుటుంబానికి గ్రామస్థుల ఆర్థిక సహాయం జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా గోసంగి కిషన్ నియామకం ఉన్నత పాఠశాలకు క్రీడా పరికారలు ఏర్పుమల్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు రహదారిని కమ్మేసిన ముళ్ళ పొదలు వేలాడుతున్న చెట్టు కొమ్మ తొలగింపు.. స్పందించిన ఉట్నూర్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై రేపు కేబినెట్ లో చర్చ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 986(1)ఏ సర్వే నంబర్ భూముల సమస్యకు పరిష్కారం.. 100 కుటుంబాలకు ఊరట! రైతుల కష్టాలు చూసి చలించిన మాతృహృదయం.. సొంత ఖర్చులతో డొంక దారి బాగు చేసిన పోకల శ్రీనివాసరావు అశ్వారావుపేటలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం* మసీదు సమీపంలో మద్యం దుకాణం వద్దు.. స్థానికుల నిరసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఘన స్వాగతం నారాయణ స్కూల్‌లో ముందస్తు దసరా సంబరాలు వేద పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

వికారాబాద్ జిల్లాలో 264 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Select Suryaa Now
వికారాబాద్ జిల్లాలో 264 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

టీచర్లు 102.. ఆయాలు 162 పోస్టులు

అక్టోబర్ 10 నుంచి 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

జిల్లా కలెక్టర్ దీపక్ తివారి 

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:

వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 264 పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 102 అంగన్వాడీ టీచర్లు, 162 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.

ప్రాజెక్టుల వారీగా ఖాళీలు ఇలా..

కోడంగల్ ప్రాజెక్టులో 13 టీచర్లు, 31 ఆయాలు; మర్పల్లి ప్రాజెక్టులో 21 టీచర్లు, 14 ఆయాలు; పరిగి ప్రాజెక్టులో 27 టీచర్లు, 78 ఆయాలు; తాండూరు ప్రాజెక్టులో 23 టీచర్లు, 28 ఆయాలు; వికారాబాద్ ప్రాజెక్టులో 18 టీచర్లు, 11 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కలెక్టర్ వివరించారు.

24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు

అర్హులైన మహిళలు అక్టోబర్ 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు http://wdcw.tg.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, స్థానికత, రిజర్వేషన్లు, ఎంపిక విధానం, ఇతర నిబంధనల పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రానికి కేటాయించిన రిజర్వేషన్ ప్రకారం అర్హత కలిగిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.

ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో కార్యాలయ పనివేళల్లో దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువీకరణ పత్రాల గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన జిరాక్స్ ప్రతులను సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.నియామక ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రద్దు చేయడం, సవరించడం లేదా అవసరమైన మార్పులు, సూచనలు జారీ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌ హోదాలో తనకు ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాల కోసం సంబంధిత చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.