రోజుకో గుడ్డు ఆరోగ్యానికి శ్రీరామరక్ష.
సూర్య న్యూస్ దర్శి.
ఆరోగ్యమే మహాభాగ్యం దానికి గుడ్డే మూలాధారమని, రోజుకు ఒక గుడ్డు తిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చందలూరు ప్రభుత్వ వైద్యాధికారి కల్లూరు శ్రీనివాసరావు అన్నారు. పౌష్టికాహార మాసోత్సవాలలో భాగంగా నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్ నగర్ నందుగల మండల ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ గుడ్డు దినోత్సవంను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు దనిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా చందలూరు ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖాధికారి కల్లూరి శ్రీనివాసరావు,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సెంట్రల్ కమిటీ కన్వీనరు కపురం శ్రీనివాసరెడ్డి,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు,దర్శి మానవత సంస్థ ప్రతినిధులు చీదెళ్ళ.బసవయ్య, సూరె నాగ చెంచు సుబ్బారావు,ఆరోగ్యశాఖ హెచ్వీ సుహాసిని పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో, గుడ్డు తినడంవల్ల శరీరానికి ఎన్ని లాభాలున్నాయో,తినకపోవడం వల్ల వచ్చే నష్టాలగురించి, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి డాక్టర్ కల్లూరి శ్రీనివాసరావు విద్యార్థులకు సవివరంగా వివరించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది సుశీలమ్మ, రమణ,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.