BREAKING
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ - విద్యార్థి విద్యాసంస్థల అధ్యర్యంలో బతుకమ్మ సంబురాలు స్టార్ డైరెక్టర్ వివి వినాయక్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ బర్త్ డే విషెస్! చిక్రం శ్రీనివాస్ కుటుంబానికి గ్రామస్థుల ఆర్థిక సహాయం జనగామ జిల్లా ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ గా గోసంగి కిషన్ నియామకం ఉన్నత పాఠశాలకు క్రీడా పరికారలు ఏర్పుమల్లలో ఘనంగా బతుకమ్మ సంబరాలు రహదారిని కమ్మేసిన ముళ్ళ పొదలు వేలాడుతున్న చెట్టు కొమ్మ తొలగింపు.. స్పందించిన ఉట్నూర్ సర్పంచ్ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై రేపు కేబినెట్ లో చర్చ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 986(1)ఏ సర్వే నంబర్ భూముల సమస్యకు పరిష్కారం.. 100 కుటుంబాలకు ఊరట! రైతుల కష్టాలు చూసి చలించిన మాతృహృదయం.. సొంత ఖర్చులతో డొంక దారి బాగు చేసిన పోకల శ్రీనివాసరావు అశ్వారావుపేటలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం* మసీదు సమీపంలో మద్యం దుకాణం వద్దు.. స్థానికుల నిరసన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఘన స్వాగతం

వృద్ధుల గౌరవం, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

Select Suryaa Now
వృద్ధుల గౌరవం, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

వృద్ధుల గౌరవం, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

— జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ జిల్లా, : వృద్ధుల పట్ల గౌరవభావంతో వ్యవహరించాలని, వారి ఆరోగ్యం, భద్రత, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. వృద్ధుల అనుభవాలు సమాజ అభివృద్ధికి మార్గదర్శకమని, కుటుంబ సభ్యులు వారికి తగిన ప్రేమాభిమానాలు, ఆదరణ అందించాలని ఆమె సూచించారు.అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ, సామాజిక భద్రత, హక్కుల పరిరక్షణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వృద్ధులకు మెరుగైన వైద్య సేవలు, సామాజిక భద్రతా పథకాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

వృద్ధుల హక్కుల పరిరక్షణకు అవగాహన కల్పించాలి

జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రుభినా బేగం మాట్లాడుతూ.. వృద్ధుల హక్కుల పరిరక్షణకు, వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, వివక్ష చూపకుండా వారిని కుటుంబంలో అంతర్భాగంగా గుర్తించి, వారి అవసరాలను గౌరవించాలని పేర్కొన్నారు.వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ, మానసిక ప్రశాంతత, సామాజిక భాగస్వామ్యం, కుటుంబ విలువల ప్రాధాన్యతపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. వృద్ధుల అనుభవాలు యువతకు మార్గదర్శకమని, వారి సేవలను గుర్తించి గౌరవించడం సమాజ నైతిక బాధ్యత అని తెలిపారు.

వృద్ధులకు గౌరవప్రదమైన జీవనం అందించాలి

జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. వృద్ధులకు గౌరవం ఇవ్వడం, వారి హక్కులను కాపాడటం, ఆరోగ్యకరమైన, భద్రతతో కూడిన జీవనాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

వృద్ధులకు ఘన సన్మానం.. విజేతలకు బహుమతులు

కార్యక్రమంలో భాగంగా వృద్ధుల హక్కులు, సంబంధిత చట్టాలపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. తమ జీవితకాలంలో వివిధ రంగాల్లో సేవలందించిన వృద్ధులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. వృద్ధుల కోసం నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గనేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి, వివిధ శాఖల అధికారులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.