నోబుల్ హై స్కూల్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నోబుల్ హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
కందుకూరు మండల కేంద్రంలోని నోబుల్ హైస్కూల్‌లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ వేడుకలనుశుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఉత్తేజభరిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని బతుకమ్మ పండుగ విశిష్టతను చాటిచెప్పారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, పూల పండుగ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ బైరెడ్డి కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు మన పండుగలు, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలుసుకొని వాటిని భావితరాలకు అందించాలని సూచించారు. ఇటువంటి వేడుకల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందుతుందని తెలిపారు.నోబుల్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మంజుల సంపత్ రెడ్డి, లావణ్య కొండల్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
టి.శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు