BREAKING
జనసేన పార్టీలోకి భారీగా ముస్లిం మైనార్టీల చేరిక! రాహుల్ గాంధీ సంచలన వీడియో.. సీజేపీ నిరసనపై స్పందన డాక్టర్ కణితి విశ్వనాథం విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించండి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తపస్ హైస్కూల్ విద్యార్థులు అడ్లూరులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పేడాడ ధరణి చంద్రగిరి మండలం లో జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన విద్యార్థిని చదువుకు మానవత ఆర్థిక సహాయం తీదేడు రామాలయం వద్ద ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బీసీ లు రాజకీయంగా ఎదగకూడదనే వైసీపీ కుట్ర -- 34 శాతం రిజర్వేషన్లు అడ్డుకునేందుకు పన్నాగాలు -- జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆగ్రహం నేడు అమరజీవి జలధార పధకానికి ఎంఎల్ఏ శంకుస్థాపన మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు చంద్రగిరి మండలం జోరుగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పర్యటన పోలవరం కాలువలో దూకిన యువకుడి మృతదేహం లభ్యం ఆకునూరు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా ఆకుల రాజు నియామకం

కుష్టు, బోదకాలు బాధితులకు మానవత చేయూత.. రూ.25 వేల విలువైన మెడికల్ కిట్లు, పాదరక్షలు, పండ్ల పంపిణీ…

Select Suryaa Now
కుష్టు, బోదకాలు బాధితులకు మానవత చేయూత..  రూ.25 వేల విలువైన మెడికల్ కిట్లు, పాదరక్షలు, పండ్ల పంపిణీ…

గన్నవరం, మేజర్ న్యూస్.

 సేవా కార్యక్రమాల్లో ముందుండే మానవత సంస్థ గన్నవరం శాఖ ఆధ్వర్యంలో కేసరపల్లి లెప్రసీ కాలనీలోని కుష్టు, బోదకాలు వ్యాధిగ్రస్తులకు శుక్రవారం పాదరక్షలు, రూ.25 వేల విలువైన వ్యక్తిగత వైద్య కిట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ ఎన్.బి.ఎం. మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై బాధితులు త్వరగా కోలుకుని సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. మానవత సంస్థ జిల్లా ట్రెజరర్, గన్నవరం శాఖ చైర్మన్ మడుపల్లి బాలకృష్ణమూర్తి మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా ఉండాలని సూచించారు. సేవా కార్యక్రమాల ద్వారా బాధితులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మానవత కన్వీనర్ శ్రీకాకుళపు సాయి, కో-చైర్మన్ వీసం ప్రసాదరావు, అధ్యక్షుడు కర్రా వరప్రసాద్, ఉపాధ్యక్షుడు కొల్లి సత్య జగదీశ్వరరావు, గౌరవ సలహాదారు ముక్కామల సుబ్బారావు, ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యార్కా రెడ్డి సంజీవరెడ్డి, పువ్వుల ఆదినారాయణ, లెప్రా సొసైటీ ప్రతినిధులు మామిడి రాధిక, వహీద్ భాష, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 

గుర్రం ప్రసాద్, గన్నవరం, క్రిృష్ణా జిల్లా…