BREAKING
మహానందిలో దసరా శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ సీఐ కరుణాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు.. శాలువాతో ఘనంగా సన్మానించిన చైతన్య కృష్ణ తెరపై చెరగని ముద్ర.. సోషల్‌ మీడియాలోనూ ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే నానా పటేకర్‌ మీమ్స్‌ జూరాల ప్రాజెక్టు దగ్గర రైతుల ఆందోళన పై కేసులు దిగ్గజ నటుడు నానా పటేకర్ మృతి: ప్రధాని మోడీ సంతాపం చంద్రబాబు కరువు కనిపించడం లేదా నంద్యాల జిల్లాలో ఐదుగురు ఎస్ఐలు బదిలీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో 46 గ్రాముల గంజాయి పట్టివేత పీడీఎస్‌ బియ్యం పట్టివేత నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ వేడుక అనంత నగరంలో పింక్ టాయిలెట్లు.. టెండర్ ప్రక్రియకు అహుడా గ్రీన్ సిగ్నల్ సమీక్ష సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన చైర్మన్ టి సి వరుణ్, వైస్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తేజ్ హైదరాబాద్‌లో భూకబ్జా కలకలం: హీరో కుటుంబంపై ఫ్లాట్ ఓనర్ల సంచలన ఆరోపణలు ఎల్ఎండి ఇన్‌చార్జ్ ఎస్సై గా అరుణ్ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి శ్రీనివాసరావు, రమ్యకృష్ణ దంపతుల విరాళం అన్నదానానికి రూ.1,00,116 సమర్పణ

చల్లూరు–మల్లారెడ్డిపల్లి రహదారిపై లారీల పార్కింగ్‌తో తీవ్ర ఇబ్బందులు

Select Suryaa Now
చల్లూరు–మల్లారెడ్డిపల్లి రహదారిపై లారీల పార్కింగ్‌తో తీవ్ర ఇబ్బందులు

 

సూర్య వీణవంక:చల్లూరు నుంచి మల్లారెడ్డిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఇసుక లారీలను నిలిపివేయడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారి ఇరుకుగా మారడంతో వాహనాలు ఎదురెదురుగా వెళ్లేందుకు కూడా అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు, పాఠశాల వాహనాలు, చిన్నారులు, రైతులు మరియు ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.మల్లారెడ్డిపల్లి ఇసుక క్వారీ వద్ద లారీలకు సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో రహదారిపైనే లారీలను నిలిపివేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మార్గంలో నిత్యం రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. ముఖ్యంగా పాఠశాల వ్యాన్లు, చిన్నారుల రాకపోకల సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల ఇదే పరిస్థితుల్లో సండి రాజు అనే జేసీబీ డ్రైవర్ లారీ ప్రమాదానికి గురైన ఘటన కూడా చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణమే స్పందించి రహదారిపై లారీల పార్కింగ్‌ను నియంత్రించాలని గ్రామస్థులు కోరుతున్నారు.క్వారీ నిర్వాహకులు లారీలకు ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి, ప్రధాన రహదారిపై వాహనాలను నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రయాణికులు మరియు పాఠశాల చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మల్లారెడ్డిపల్లి గ్రామస్థులు కోరుతున్నారు.