మహానంది క్షేత్రంలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో, చైర్మన్
సూర్య, నంద్యాల బ్యూరో:
మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల 11 నుండి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలు వైభవంగా జరుపుతూ దిగ్విజయం చేస్తామని చైర్మన్ నరాల మౌలేశ్వర్ రెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం మహానంది క్షేత్రంలో దసరా ఏర్పాట్లను వారు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాలాజీ సేవా సమితి సభ్యులు పాల్గొని ఆలయంలో ఉత్సవాలకు ఉపయోగించే స్వామివారి వాహనాలను, మండపాలను, సహస్ర దీపాలను శుద్ధి చేశారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*