చిన్నారుల ఆరోగ్యమే దేశానికి శ్రీ మహాలక్ష్మి.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
చిన్నారుల ఆరోగ్యమే దేశానికి శ్రీ మహాలక్ష్మిని, చిన్నారుల ఆరోగ్యానికి వారి భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడీ కేంద్రాలని కార్యకర్తలన్నారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో పోషణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలకు సరైన పోషణ ఆరోగ్యవంతమైన శిశువు జననం కు అంగన్వాడీ కేంద్రాలు దోహదపడతాయన్నారు. పిల్లలకు, తల్లులకు ,గర్భవతులకు అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం అంద చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండలమూరు వేంపాడు శంకరాపురం గ్రామాల చెందిన అంగన్వాడీ కార్యకర్తల పాల్గొన్నారు.