గుండెపోటుతో మృతి చెందిన ఎన్నికల డేటా ఎంట్రీ ఆపరేటర్ కుటుంబానికి ఆర్థిక సాయం
అనంతపురం బ్యూరో : గుండెపోటుతో మృతి చెందిన ఎన్నికల డేటా ఎంట్రీ ఆపరేటర్ కుటుంబానికి జిల్లా యంత్రాంగం అండగా నిలిచింది. విడపనకల్ మండలానికి చెందిన ఎన్నికల డేటా ఎంట్రీ ఆపరేటర్ సి.ప్రశాంత్ కుమార్ గత నెల 19న గుండెపోటుతో మృతి చెందారు.
ఈ నేపథ్యంలో గురువారం అనంతపురం కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో ఆయన కుటుంబ సభ్యులకు రూ.80 వేల ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అందజేశారు. కుటుంబానికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో ఏ.మలోల, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర కోశాధికారి దివాకర్ రావు, ఎన్నికల సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్, ఎన్నికల ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు ఎ.ఇంథియాజ్, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.