యూఏఈ పర్యటన ముగించుకుని రేపు హైదరాబాద్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:
స్టడీ టూర్‌లో భాగంగా యూఏఈ పర్యటనకు వెళ్లిన తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తన పర్యటనను ముగించుకుని రేపు (శుక్రవారం) హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఉదయం 8 గంటలకు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నట్లు సమాచారం.స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శంషాబాద్ విమానాశ్రయానికి తరలిరానున్నారు. వికారాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు స్వాగత కార్యక్రమానికి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.యూఏఈ పర్యటనలో భాగంగా స్టడీ టూర్‌లో పాల్గొన్న స్పీకర్ తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.