ఆర్థిక ఇబ్బందులతో యువకుడి మృతి
కీసర,మేజర్ న్యూస్,(అక్టోబర్ 08):
ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన నాగారం డివిజన్ పరిధిలోని రాంపల్లి సిరిపురం కాలనీలో చోటుచేసుకుంది. కీసర సిఐ బిక్కి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి పమారు గ్రామానికి చెందిన వెంకట్ రమణ (37) కొంతకాలంగా రాంపల్లి సిరిపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ క్రమంలో వెంకట్ రమణ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దింతో తీవ్ర అస్వస్థతకు అతను గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.ఘటనపై కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
రిపోర్టర్: కర్రె గణేష్, కీసర, మేడ్చల్ జిల్లా.