మహానంది పుణ్యక్షేత్రంలో నిత్యాన్నదానానికి రూ. 10,116 విరాళం
సూర్య, నంద్యాల బ్యూరో::మహానంది పుణ్యక్షేత్రంలో కొనసాగుతున్న శ్రీ మహానందీశ్వర స్వామివారి నిత్యాన్నదాన పథకానికి భక్తుడు కొండమాల చక్రపాణి రూ.10,116 విరాళం అందించారు. మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కొండమాల చక్రపాణి, తన తండ్రి కొండమాల కొండయ్య జ్ఞాపకార్థం రూ.10,116/- విరాళాన్ని ఆలయ అధికారులకు సమర్పించారు. దాత చక్రపాణిని ఆలయ పర్యవేక్షకుడు సుబ్బారెడ్డి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి, నిత్యాన్నదానానికి సంబంధించిన బాండుతో పాటు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*