BREAKING
పాఠశాలలో డీఈఓ ఆకస్మిక తనిఖీ.. సెల్ ఫోన్ చోరీ వివాదంలో .. ఓ వ్యక్తి హత్య? పైకప్పు కూలిన పాఠశాల భవనాన్ని పరిశీలించిన కోడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ తొలగించిన ఓటర్ల జాబితాలో ప్రతి పేరును క్షేత్రస్థాయిలో పునఃపరిశీలించాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పంటలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి- సిఐ జయరాం కంబదూరులో ట్రాన్స్ ఫార్మర్ పేలి మంటలు. ఫిన్లాండ్‌లో 11 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్ హోం శాఖ మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ ఏఐ చిప్స్ డిమాండ్‌తో రికార్డు సృష్టించిన తైవాన్ దిగ్గజం వత్సవాయిలో వీఆర్ఏల సమ్మె 23వ రోజుకు . సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటం ,పే స్కేల్ అమలు చేయాలి.. వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చక్కెర ధరల పతనాన్ని భర్తీ చేసిన బయోడీజిల్ విక్రయాలు ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ 'ప్రొటీన్‌మ్యాక్సింగ్' ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే...ప్యాకేజ్డ్ ఫుడ్ దిగ్గజాలకు విశ్లేషకుల హెచ్చరిక

మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి- సిఐ జయరాం

Select Suryaa Now
మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి- సిఐ జయరాం

సూర్య, నంద్యాల బ్యూరో:మహిళా చట్టాలపై ప్రతి ఒకరు అవగాహన కలిగి ఉండాలని మహిళా పోలీస్ స్టేషన్ సిఐ జయరాం అన్నారు. గురువారం నంద్యాల
నంద్యాల పట్టణం లోని నేషనల్ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు శక్తి యాప్ మరియు శక్తి టీమ్ లపై అవగాహన సదస్సును నిర్వహించారు. సిఐ జయరాం మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలకు శక్తి యాప్ లపై మరియు శక్తి టీమ్ లు పనితీరుపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఆపద సమయంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్ 112 ఏదైనా సైబర్ నేరాలు జరిగినప్పుడు 1930 ఫోన్ నెంబర్లను ఉపయోగించుకోవాలన్నారు. మీకు మీరు సీయో రక్షణ చేసుకోవాలన్నారు. అవేర్నెస్ ప్రోగ్రాము ద్వారా ఆడపిల్లలకు తెలియజేయడం జరిగిందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో మీ చదువులలో మీరు ఎంత బిజీగా ఉన్నారో మీ చదువులు ఆటంకం కలగకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆడపిల్లల సంరక్షణ కోసం శక్తి టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మీకు తెలియకుండానే మీ ఫోన్ లకు ఏదైనా ఈకేవైసిలు వచ్చిన  వాటిని తెరవకపోవడమే మంచిదన్నారు. మీ ఫోన్ లకు ఎటువంటి ఓటీపీలు వచ్చినా వాటిని షేర్ చేసుకోకపోవడమే మంచిదన్నారు. మీకు సంబంధించిన ఫోటోలను 80లో జనరేషన్ అప్లోడ్ చేయడం వలన మీ సమాచారాన్ని సేకరించి మీ ఫోటోలను మార్ఫింగ్ ద్వారా నీకు బ్లాక్ మెయిలింగ్ చేసే ఆస్కారము ఉందన్నారు. కావున జాగ్రత్తగా ఉండాలని ఏదైనా పోటీ పరీక్షలకు దూరప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు తెలిసిన బంధువులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వన్ స్టాప్ సెంటర్ల సహాయం కోరి మీరు వసతి తీసుకోవాలన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*