BREAKING
కంబదూరులో ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు. ఫిన్లాండ్‌లో 11 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఏఐ చిప్స్ డిమాండ్‌తో రికార్డు సృష్టించిన తైవాన్ దిగ్గజం వత్సవాయిలో వీఆర్ఏల సమ్మె 23వ రోజుకు . సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటం ,పే స్కేల్ అమలు చేయాలి.. వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చక్కెర ధరల పతనాన్ని భర్తీ చేసిన బయోడీజిల్ విక్రయాలు ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ 'ప్రొటీన్‌మ్యాక్సింగ్' ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే...ప్యాకేజ్డ్ ఫుడ్ దిగ్గజాలకు విశ్లేషకుల హెచ్చరిక అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం గుంతకల్‌లో 180 మంది పోలీసులతో విస్తృత సోదాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాభాల్లో శామ్‌సంగ్ వెనుకడుగు నరశింగోలులో ముమ్మర పారిశుధ్య పనులు 4 బిలియన్ డాలర్ల నియోక్లౌడ్ ఐపీఓకు ఎదురుదెబ్బ...కృత్రిమ మేధస్సు రంగంలో బుడగ వ్యాఖ్యలపై చర్చ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ: ఢిల్లీ చేరుకున్న నేతలకు విమానాశ్రయంలో ఘన స్వాగతం! మంత్రి పొంగూరు నారాయణతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ

వత్సవాయిలో వీఆర్ఏల సమ్మె 23వ రోజుకు . సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటం ,పే స్కేల్ అమలు చేయాలి.. వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్

Select Suryaa Now
వత్సవాయిలో వీఆర్ఏల సమ్మె 23వ రోజుకు . సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటం  ,పే స్కేల్ అమలు చేయాలి.. వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి  నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్

సూర్య ప్రతినిధి, వత్సవాయి (రాంబాబు): తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె వత్సవాయిలో 23వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే వరకు సమ్మెను కొనసాగిస్తామని వీఆర్ఏలు స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వివిధ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ తమకు సరైన వేతనాలు, ఉద్యోగపరమైన ప్రయోజనాలు, పదోన్నతులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అర్హత, అనుభవం ఉన్న వీఆర్ఏలకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. అదేవిధంగా నామినీగా కొనసాగుతున్న వీఆర్ఏలను ఎలాంటి జాప్యం లేకుండా రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.గ్రామస్థాయిలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ రెవెన్యూ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే పరిష్కరించాలని వీఆర్ఏలు కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని న్యాయం చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.