BREAKING
కంబదూరులో ట్రాన్స్ఫార్మర్ పేలి మంటలు. ఫిన్లాండ్‌లో 11 బిలియన్ డాలర్లతో ఏఐ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఏఐ చిప్స్ డిమాండ్‌తో రికార్డు సృష్టించిన తైవాన్ దిగ్గజం వత్సవాయిలో వీఆర్ఏల సమ్మె 23వ రోజుకు . సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటం ,పే స్కేల్ అమలు చేయాలి.. వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చక్కెర ధరల పతనాన్ని భర్తీ చేసిన బయోడీజిల్ విక్రయాలు ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ 'ప్రొటీన్‌మ్యాక్సింగ్' ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే...ప్యాకేజ్డ్ ఫుడ్ దిగ్గజాలకు విశ్లేషకుల హెచ్చరిక అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం గుంతకల్‌లో 180 మంది పోలీసులతో విస్తృత సోదాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాభాల్లో శామ్‌సంగ్ వెనుకడుగు నరశింగోలులో ముమ్మర పారిశుధ్య పనులు 4 బిలియన్ డాలర్ల నియోక్లౌడ్ ఐపీఓకు ఎదురుదెబ్బ...కృత్రిమ మేధస్సు రంగంలో బుడగ వ్యాఖ్యలపై చర్చ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ: ఢిల్లీ చేరుకున్న నేతలకు విమానాశ్రయంలో ఘన స్వాగతం! మంత్రి పొంగూరు నారాయణతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ

కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ

Select Suryaa Now
కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ

న్యూఢిల్లీ, సూర్య ప్రతినిధి :పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని, ఇటీవల రూ.30 వేల కోట్లతో చేపట్టిన జల్ జీవన్ మిషన్-అమరజీవి జలధార పనుల వివరాలను కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులకు నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేసేలా పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఈ సందర్భంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో సుదీర్ఘంగా పెండింగులో ఉన్న పలు అంశాలను పరిష్కారించాలని సీఎం కోరారు.