BREAKING
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఏఐ చిప్స్ డిమాండ్‌తో రికార్డు సృష్టించిన తైవాన్ దిగ్గజం వత్సవాయిలో వీఆర్ఏల సమ్మె 23వ రోజుకు . సమస్యల పరిష్కారం కోసం కొనసాగుతున్న పోరాటం ,పే స్కేల్ అమలు చేయాలి.. వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలి నామినీ వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చక్కెర ధరల పతనాన్ని భర్తీ చేసిన బయోడీజిల్ విక్రయాలు ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి పట్ల మంత్రి కందుల దుర్గేష్ సంతాపం: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ 'ప్రొటీన్‌మ్యాక్సింగ్' ఒక తాత్కాలిక ట్రెండ్ మాత్రమే...ప్యాకేజ్డ్ ఫుడ్ దిగ్గజాలకు విశ్లేషకుల హెచ్చరిక అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం గుంతకల్‌లో 180 మంది పోలీసులతో విస్తృత సోదాలు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాభాల్లో శామ్‌సంగ్ వెనుకడుగు నరశింగోలులో ముమ్మర పారిశుధ్య పనులు 4 బిలియన్ డాలర్ల నియోక్లౌడ్ ఐపీఓకు ఎదురుదెబ్బ...కృత్రిమ మేధస్సు రంగంలో బుడగ వ్యాఖ్యలపై చర్చ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీ: ఢిల్లీ చేరుకున్న నేతలకు విమానాశ్రయంలో ఘన స్వాగతం! మంత్రి పొంగూరు నారాయణతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ తాడిపత్రి డీఎస్పీగా ఎం. చంద్రశేఖర్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ఎంపీ గంటి హరీష్ భేటీ

అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం గుంతకల్‌లో 180 మంది పోలీసులతో విస్తృత సోదాలు..

Select Suryaa Now
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం  గుంతకల్‌లో 180 మంది పోలీసులతో విస్తృత సోదాలు..

సూర్య, అనంతపురం బ్యూరో : పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ ఆదేశాల మేరకు గుంతకల్ డీఎస్పీ బి. శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో 180 మంది పోలీసు సిబ్బందితో గుంతకల్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

గంగానగర్, షికారి కాలనీ, బెంచికొట్టాల, రైల్వే స్టేషన్ పరిసరాలు, కసాపురం ఫ్యాక్షన్ గ్రామం, గుంతకల్–ధోనిముక్కల రోడ్డు ప్రాంతాల్లో రౌడీషీటర్ల ఇళ్లు, అనుమానితుల ఇళ్లు, అనుమానాస్పద ప్రదేశాల్లో పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పలు నేరాల్లో ఉన్న వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ తెరవడంతో పాటు నిరంతరం నిఘా ఉంచుతామని తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ను కూడా ప్రయోగిస్తామని స్పష్టం చేశారు.

అక్రమ ఆయుధాలు, వాహనాలు కలిగి ఉన్న వారిపై ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో గంజాయి విక్రయాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పార్టీల మధ్య లేదా కమ్యూనిటీల మధ్య ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించే వారిని గుర్తించి, అవసరమైతే సస్పెక్ట్ షీట్లు తెరిచి నిఘా పెడతామని తెలిపారు.

ఇదే సమయంలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, సైబర్ నేరాలపై మహిళలు, వృద్ధులకు పోలీసులు అవగాహన కల్పించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో, సేవా దృక్పథంతో పనిచేసి పోలీస్ శాఖ ప్రతిష్ఠను పెంచేందుకు కృషి చేస్తామని డీఎస్పీ తెలిపారు.

ఈ తనిఖీల్లో గుంతకల్ వన్‌టౌన్ ఎస్సై కళ్యాణ్, టూటౌన్ ఎస్సై సురేష్, రూరల్ ఎస్సై బాలముని, కసాపురం ఎస్సై వెంకటస్వామి, 180 మంది ప్రొబేషనరీ కానిస్టేబుళ్లు, స్థానిక పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.