ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి గురువారం బాపట్ల జిల్లా, పర్చూరు గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత విచ్చేశారు. పర్చూరులోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హోం మంత్రి గారిని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను బహుకరించారు.