మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల ధృవీకరణ పత్రాల జారీ మొబైల్ ఫోన్ ద్వారానే కుల ధృవీకరణ పత్రం డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు ఇకపై తమ మొబైల్ ఫోన్ నుంచే కుల ధృవీకరణ పత్రాన్ని పొందే సదుపాయం కల్పించినట్లు ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. ప్రజలు తాము ఉన్న చోటు నుంచే ఎప్పుడైనా ఈ సేవను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.కుల ధృవీకరణ పత్రం పొందేందుకు ముందుగా 9552300009 మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నంబరుకు ‘హాయ్’ అని సందేశం పంపాలి. అనంతరం అందుబాటులో ఉన్న సేవల్లో ‘రెవెన్యూ సేవలు’ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అందులో ‘రీ ఇష్యూయెన్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.తర్వాత ఆధార్ నంబర్‌ను నమోదు చేయగా మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేసిన అనంతరం అడిగిన వివరాలను పొందుపరచాలి. కుల ధృవీకరణ పత్రం కోసం రూ.40 రుసుం చెల్లించిన తర్వాత సర్టిఫికెట్‌ను మొబైల్ ఫోన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఈ సదుపాయాన్ని కల్పించినట్లు పేర్కొన్న అధికారులు, ప్రజలు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సూర్య ప్రతినిధి,వత్సవాయి. (రాంబాబు )