BREAKING
చెన్నై చేరుకున్న రాహుల్ గాంధీ: సీఎం విజయ్‌తో భేటీ, నేడు విద్యార్థులతో ముఖాముఖి అర్హులైన ఒక్కరూ ఓటరు నమోదు కోవాలి . ఆర్డీవో వసంత బాబు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్ర అభివృద్ధి ఎం ఎల్ సీ ఎన్నికల్లో విజయానికి పక్కా వ్యూహం భారత ఐటీ కంపెనీలపై అమెరికా ఆంక్షలను తీవ్రంగా తప్పుబట్టిన భారత్. ప్రొఫెసర్ బిమోల్ అకోయిజమ్‌ను విధుల నుంచి తొలగించిన జేఎన్‌యూ! 28వ డివిజన్ భానునగర్‌లో పలువురు టీడీపీలో చేరిక యూపీ నుంచి 10 మంది రాజ్యసభకు ఏకగ్రీవ ఎన్నిక అనంతపురంలో యూజేఏసీ, వామపక్షాల, వైస్సార్సీపీ , కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ* *ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి..* *ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి – బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలి* జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలకు హాజరైన ఎమ్మెల్యే గడ్డకట్టే చలిలో బైకర్‌కు అల్పాహారం అందించిన ఆర్మీ అధికారి.. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కె.ఆర్. రామకోటేశ్వర్ రెడ్డి పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోటీలు ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు తయారు చేస్తూ నెలకు రూ.60,000 సంపాదన.. పార్లమెంట్ కోఆర్డినేషన్ కమిటీలోనికి గంగరాజుకు చోటు.

దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

Select Suryaa Now
దుగరాజపట్నంలో షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయండి

సూర్య న్యూఢిల్లీ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను (బ్లూ ఎకానమీ) మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పన, తీరప్రాంత పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన కీలక ప్రతిపాదనలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను ప్రస్తావిస్తూ.. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో అత్యాధునిక షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ను (ఓడల నిర్మాణ కేంద్రాన్ని) ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశంలో రెండో అతిపెద్ద సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఓడల నిర్మాణం, మరమ్మతుల రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని, ఇందుకు కేంద్రం చొరవ తీసుకుని ప్రాజెక్టును పట్టాలెక్కించాలని కోరారు. తద్వారా రాష్ట్రంలో వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తీరప్రాంత ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతుందని వివరించారు.

అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్న పోర్టుల అనుసంధానం, లోతట్టు జలరవాణా (ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్), తీరప్రాంత కారిడార్ల అభివృద్ధికి కేంద్ర సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు. దీనిపై కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సానుకూలంగా స్పందిస్తూ, ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.