కారుపై రాయి విసిరిన బైకర్: కేరళలో నిందితుడి అరెస్ట్, పాత నేర చరిత్ర వెలుగులోకి!
సూర్య క్రైమ్ డెస్క్: కేరళలోని తిరూర్ ప్రాంతంలో రోడ్డుపై జరిగిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. బైకును కారు తాకిందన్న ఆగ్రహంతో హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న కారుపైకి పెద్ద రాయిని విసిరాడు. ఈ దాడి కారణంగా కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన నిందితుడిని సమీర్‌గా గుర్తించారు. విచారణలో నిందితుడిపై గతంలోనూ హత్యాయత్నం సహా పలు క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డుపై అత్యంత ప్రమాదకర రీతిలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించి, ప్రాణాపాయం కలిగించేలా దాడికి పాల్పడినందుకు అతనిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.