తిరుమల శ్రీవారికి రూ.51.55 లక్షల విలువైన బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
తిరుమల,, సూర్య ప్రతినిధి :
తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తమ భక్తి శ్రద్ధలను చాటుకుంటూ భారీ కానుకలు సమర్పిస్తున్నారు. తాజాగా జైపూర్‌కు చెందిన ఒక దంపతులు శ్రీవారికి రూ.51.55 లక్షల విలువైన సుమారు 700 గ్రాముల బంగారు లాకెట్‌తో పాటు అందమైన ముత్యాలహారాన్ని విరాళంగా అందజేశారు. తిరుమలకు విచ్చేసిన ఈ భక్తులు ఆలయ అధికారులను కలిసి తమ కానుకలను శ్రీవారికి అంకితం చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా TTD అధికారులు వారికి స్వాగతం పలికి, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు అందించారు.