BREAKING
బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు

ఆందోళన చేస్తున్న వారి అక్రమ అరెస్టులను ఖండించండి

Select Suryaa Now
ఆందోళన చేస్తున్న వారి అక్రమ అరెస్టులను ఖండించండి

గూడూరు , మేజర్‌న్యూస్‌  :     భారత ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టులు చేయడాన్ని సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డిపి పోలయ్య తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన ప్రకటనలో       మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్) కారణంగా దేశంలో సుమారు 13 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని అన్నారు. ఫారం -6లో మార్పులు చేసి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దూరం చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని అన్నారు. సర్ ప్రక్రియలో దళిత, ఆదివాసీ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ, పేద వర్గాల ప్రజలే ఓటు హక్కు కోల్పోయారని అన్నారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా మోదీ ప్రభుత్వం నిర్భందాన్ని అమలు చేసిందని దుయ్య బట్టారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనా కారులపై లాటీఛార్జి, వాటర్ క్యానన్లతో దాడి చేశారని అన్నారు. విజయవాడలో లెనిన్ సెంటర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కూటమి ప్రభుత్వం పోలీసులను దించి నాయకులను ఈడ్చుకుంటూ అక్రమంగా  అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారని అన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా జ్ఞానేశ్ కుమార్ చేత రాజీనామా చేయించాలని, తొలగించిన 13 కోట్ల ఓటర్లను తిరిగి ఓటర్ జాబితాలో చేర్చాలని, సర్‌ను రద్దు చేయాలని లేకుంటే ఉద్యమం ఇంకా తీవ్రతరమై ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు.