కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం(
సిమెంటురోడ్డు భూమిపూజలో నాయకులు :సిఎస్ పురం,మేజర్ న్యూస్: కేంద్రప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి మౌళికవసతులు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు మాజీసర్పంచ్, టిడిపినేత గోదాసు బాలసుబ్బమ్మ జయరాములు, పలువురు నాయకులు అన్నారు.ఆదివారం మండలంలోని డిజిపేట పంచాయతీ పరిధిలో డిజిపేట నుండి బొంతవారిపల్లెకు విబిజీ రాంజీ నిధులు సుమారు 2.70కోట్ల రూపాయలతో చేపడుతున్న సిమెంట్ రహదారి నిర్మాణానికి డిజిపేట మాజీసర్పంచ్,టిడిపినేత గోదాసు బాలసుబ్బమ్మ జయరాములు,నాయకులు అర్చకులు రామ్మూర్తిశర్మ అధ్వర్యంలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి ప్రజాసంక్షేమం లక్ష్యంగా గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే,ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయించి ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నట్లు అన్నారు. ఈకార్యక్రమంలో మాజీసర్పంచ్ గోదాసుబాలసుబ్బమ్మ, ప్రభుత్వ కనీసవేతనాల సలహామండలి సభ్యులు డాక్టర్ బొమ్మనబోయిన వెంగయ్య, ఒంగోలు పార్లమెంట్ టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి యన్.సి.మాలకొండయ్య,సొసైటీ చైర్మన్ చెరుకుపల్లె వెంకటరెడ్డి,బోయళ్ల నారాయణరెడ్డి,పావలి తిరపతయ్య,షేక్ అబ్దుల్ ఖాదర్,నన్నసాని మహాలక్ష్మయ్య,అన్నెబొయినతిరపతయ్య,పి.రామ్మోహనరెడ్డి,యం.రాజేంద్రరెడ్డి,ఐ.వి.కొండయ్య,రేనాటివెంకటేశ్వర్లు,పి.మహేంద్ర,శ్రీను,స్థానిక నాయకులు కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.