BREAKING
వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ!

వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు

Select Suryaa Now
వైభవంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు
అవనిగడ్డ, మేజర్ న్యూస్; దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లోని పలు ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించగా, తొలి రోజు అయిన ఆదివారం అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాచీన శివాలయం గా పేరొందిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజశేఖర్ స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల రాజశేఖర్ (పసి), శ్రీ లక్ష్మి దంపతులు అమ్మవారి దగ్గర కలశ ప్రతిష్ట చేశారు.శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఉభయ దాతలుగా ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) హేమలత దంపతుల చేత ఘంటసాల పవన్ కుమార్ శర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్థానిక గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి బ్రహ్మశ్రీ వఝల వెంకట నాగ సత్య సాయి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ లు ఘంటసాల కన్నయ్య, అన్నపురెడ్డి వెంకటస్వామి, ఆలయ కార్య నిర్వహణ అధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు (వాసు) లు పర్యవేక్షించారు. స్థానిక గీతా మందిరంలో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త పెరసెట్టి శ్రీహరిబాబు ప్రముఖ న్యాయవాది సనకా రఘురాం ప్రసాద్ నాగమల్లేశ్వరరావు దంపతులు అభిషేకాలు పాల్గొనగా అర్చకులు దీవి నరసింహమూర్తి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. పూలు, పండ్లు, వివిధ పూజా సామగ్రితో అమ్మవారికి మొక్కులు సమర్పించి, కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణాలు భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
దసరా నవరాత్రుల్లో రోజుకో అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనుండటంతో, రానున్న రోజుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తుల సందడి మరింత పెరగనుంది. నవరాత్రి వేడుకలతో దివిసీమ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.