శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం
సీఎస్ పురం,మేజర్ న్యూస్: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం మండలకేంద్రమైన సిఎస్ పురం పట్టణంలోని అతిపురాతన మహిమాన్వితమైన శ్రీకామాక్షి సమేత చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలను వైభవంగా ప్రారంభించారు.ఈసందర్భంగా నూతనంగా నిర్మించిన కామాక్షి అమ్మవారు చంద్రమౌళీశ్వరస్వామి ఆవరణ రంగులతో శోభాయమానంగా అలంకరణ చేశారు.ఈసందర్భంగా ప్రత్యేక అలంకరణ చేసిన దేవస్థానంలో ఉదయం అర్చకులు శ్రీకృష్ణశర్మ అధ్వర్యంలో స్వామివారికి అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమార్చన పూజలు నిర్వహించి అమ్మవార్లను స్వామివార్లను పట్టువస్త్రాలు పూలమాలలతో అలంకరణ చేశారు.అనంతరం దేవస్థానంలో కళశస్థాపన చేసి ఉభయదాతలు గ్రంధిహేమసుందరం దంపతులు దేవస్థానం అభివృద్ధి కమిటీ సభ్యులతో గణపతి వివిధ హోమపూజలు నిర్వహించి అనంతరం పూర్ణాహుతి నైవేద్యం సమర్పించి హారతులు ఇచ్చి తీర్ధప్రసాదాలు అందజేశారు.ఈసందర్భంగా కామాక్షిదేవి భజనమండలి మహిళలు దేవీస్త్రోత్రం పఠనం చేయగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారు స్వామివార్లను దర్శించుకున్నారు. అదేవిధంగా విజయదశమి సందర్భంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు అమ్మవారిని విశేష అలంకరణలు చేసి పూజలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు.