BREAKING
28 రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న యూట్యూబర్ నందన.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ వైరల్! హెచ్‌సీఎల్‌టెక్ జోరు: పూర్తి స్థాయి రాబడి వృద్ధి అంచనా (గైడెన్స్) 2.5–4 శాతానికి పెంపు.. ఎబిట్ మార్జిన్ల ఔట్‌లుక్ యథాతథం! దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చిన్న వయసులోనే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు.. మన జీవనశైలిలో జరుగుతున్న తీవ్రమైన పొరపాట్లు ఇవే! బ్రిటన్‌లో బోనస్‌ పరిమితి రద్దు: ఉద్యోగుల 'ఫిక్స్‌డ్ పే అలవెన్సులు' ఎత్తివేయనున్న హెచ్‌ఎస్‌బీసీ.. 2028 నుంచి పెరగనున్న బోనస్‌ల వాటా! ఇంటి వంటలతోనే ఆరోగ్య రక్షణ.. బయటి ఫాస్ట్ ఫుడ్స్ వల్ల కలిగే ముప్పుపై నిపుణుల హెచ్చరిక! ఆసరాగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం

కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు

Select Suryaa Now
కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌  వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు

అనంతపురం బ్యూరో : పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా కళ్యాణదుర్గం పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు.

కళ్యాణదుర్గం టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ వి. హరినాథ్‌, రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి. గంగాధర్‌ ఆధ్వర్యంలో బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి పోలీస్‌ స్టేషన్ల సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది కలిసి ఉదయం 6 గంటలకు పట్టణంలోని మారెంపల్లి, ఇందిరమ్మ కాలనీల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వాహనాలను ఆపి వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌, ఇతర అవసరమైన రికార్డులను పరిశీలించారు. సరైన రికార్డులు లేని వాహనాలను గుర్తించి, నిబంధనల ప్రకారం చలానాలు విధించారు.

పోలీసుల తనిఖీల ద్వారా వాహనదారుల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పెంచడంతో పాటు, అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీసు శాఖ తనిఖీలను కొనసాగిస్తోంది.

 

రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.