కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి..
సూర్య బోయినపల్లి ..:బోయినపల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో వేములవాడలో ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న నాగశేఖర్ మృతి చెందాడు. బాన్సువాడ నుంచి వలస వచ్చి జీవనం సాగిస్తున్న శేఖర్ మృతితో విషాదం నెలకొంది. స్థానికులు మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.